Skip to content
Home » ఏ మాస్టర్ పీస్ టీజర్ రిలీజ్‌కు మూహూర్తం ఫిక్స్

ఏ మాస్టర్ పీస్ టీజర్ రిలీజ్‌కు మూహూర్తం ఫిక్స్

ఏ మాస్టర్ పీస్’ టీజర్ రిలీజ్‌కు మూహూర్తం ఫిక్స్

‘శుక్ర’, ‘మాటరాని మౌనమిది’ వంటి డిఫరెంట్ మూవీస్ తర్వాత దర్శకుడు సుకు పూర్వజ్ రూపొందిస్తున్న కొత్త సినిమా “ఏ మాస్టర్ పీస్”. అరవింద్ కృష్ణ, జ్యోతి పూర్వాజ్, అషు రెడ్డి లీడ్ రోల్స్‌లో నటిస్తున్న ప్రతిష్టాత్మక ఫిల్మ్ ప్రొడక్షన్ సినిమా బండి ప్రొడక్షన్స్  తో కలిసి ప్రొడక్షన్ స్టూడియో మెర్జ్ ఎక్స్ ఆర్  పతాకం పై శ్రీకాంత్ కండ్రేగుల, మనీష్ గిలాడ “ఏ మాస్టర్ పీస్” సినిమాను నిర్మిస్తున్నారు. ఈ సినిమా మైథాలజీ, సైన్స్ ఫిక్షన్ కలిసిన ఒక న్యూ కాన్సెప్ట్ సూపర్ హీరో మూవీ ఎక్సీపిరియన్స్ ను తెలుగు ప్రేక్షకులకు అందించబోతోంది.

టీజర్ రిలీజ్ ప్రకటన

ఈ రోజు “ఏ మాస్టర్ పీస్” సినిమా టీజర్ అనౌన్స్ మెంట్ చేశారు మేకర్స్. జూన్ 7వ తేదీ మధ్యాహ్నం 3.33 నిమిషాలకు టీజర్ విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు. అద్భుతమైన విజువల్స్, భారీ మేకింగ్, విజువల్ ఎఫెక్టులతో “ఏ మాస్టర్ పీస్” సినిమాను రూపొందిస్తున్నారు దర్శకుడు సుకు పూర్వజ్. ఈ సినిమా చిత్రీకరణ తుది దశకు చేరుకుంది. ఈ ఏడాదిలోనే “ఏ మాస్టర్ పీస్” సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నారు. హై స్టాండర్డ్ ప్రొడక్షన్ వ్యాల్యూస్ తో యూనిక్ సూపర్ హీరో ఫిల్మ్ గా “ఏ మాస్టర్ పీస్” ఉండబోతోంది. మేకర్స్ టీజర్ విడుదల వేడుకకు మెగాస్టార్ చిరంజీవిని, మరియు సినిమాటోగ్రఫీ మంత్రి కొమటిరెడ్డి వెంకట్ రెడ్డిని ఆహ్వానించాలనే ప్లాన్ చేస్తున్నారు, ఇది ప్రేక్షకుల్లో మరింత ఆసక్తిని రేకెత్తిస్తుంది.

నటీనటులు

  • అరవింద్ కృష్ణ
  • జ్యోతి పూర్వాజ్
  • అషు రెడ్డి
  • శివ మాధవ్
  • మనీష్ గిలాడ
  • శ్రీకాంత్ కండ్రేగుల
  • స్నేహ గుప్త
  • అర్చనా అనంత్
  • జయప్రకాశ్
  • తదితరులు

టెక్నికల్ టీమ్

  • సినిమాటోగ్రఫీ: శివరామ్ చరణ్
  • సంగీతం: ఆశీర్వాద్
  • ఎడిటర్: సుకు పూర్వజ్, మనోజ్ కుమార్. బి, శివ శర్వాని
  • కాస్ట్యూమ్స్: ఉదయశ్రీ పూర్వజ్, సలీనా విలియమ్స్ (యూకే)
  • స్టంట్స్: రాజ్ కుమార్ గంగపుత్ర
  • పీఆర్వో: జీఎస్ కే మీడియా
  • టెక్నికల్ మేనేజర్: శివ మాధవ్
  • బ్యానర్స్: సినిమా బండి, మెర్జ్ ఎక్స్ ఆర్
  • నిర్మాతలు: శ్రీకాంత్ కండ్రేగుల, మనీష్ గిలాడ, ప్రజయ్ కామత్
  • రచన, దర్శకత్వం: సుకు పూర్వజ్

“ఏ మాస్టర్ పీస్” టీజర్ విడుదల తేదీకి అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ సరికొత్త సూపర్ హీరో కథ, మైథాలజీ, సైన్స్ ఫిక్షన్ కలయికతో తెలుగు ప్రేక్షకులను అలరించబోతోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *