Skip to content

కష్టాల్లో ‘పద్మ శ్రీ మొగిలయ్యకు’. డబ్బు సాయం చేసిన బుల్లితెర నటి జ్యోతిరాయ్

జ్యోతిరాయ్

 

బుల్లితెర నటి జ్యోతిరాయ్ తెలుగు ప్రేక్షకులకు చాలా దగ్గరగా ఉంటుంది. గుప్పెడంత మనసు సీరియల్తో ఆమె మరింత పాపులర్ అయింది. కన్నడ పరిశ్రమకు చెందిన ఈ బ్యూటీ పలు సినిమాల్లో నటించడమే కాకుండా వెబ్ సిరీస్లలో కూడా మెప్పిస్తుంది. కన్నడ బుల్లితెర నటిగా ఎన్నో సీరియల్స్ లో నటించి మంచి సక్సెస్ అందుకున్నటువంటి జ్యోతి. తెలుగులోనూ సూపర్ సక్సెస్ సాధిస్తోంది. ఇలా కెరియర్ లో దూసుకుపోతున్న ఈమె. అయితే ఆమె పర్సనల్ వీడియో లీక్ అంటూ కన్నడ పరిశ్రమలో పలు వార్తలు వచ్చాయి. తాజాగా వాటిని ఆమె తిప్పికొట్టింది. అక్షయ తృతీయ రోజు అందరిలా బంగారం కొనకుండా కానీ, జ్యోతీరాయ్ ఆ డబ్బుతో పద్మ శ్రీ అవార్డు గ్రహీత 12 మెట్ల కిన్నెర కళాకారుడు దర్శనం మొగిలయ్యకు సాయం చేసి తన గొప్ప మనసు చాటుకుంది.

తెలంగాణకు చెందిన కిన్నెర కళాకారుడు దర్శనం మొగిలయ్యకు పద్మ శ్రీ అవార్డు వరించిన విషయం తెలిసిందే. అయితే, బలగం సినిమాలో లాస్ట్ లో ఓ పాట పాడి.. అందరి చేత కన్నీరు పెట్టించిన ఈయన.. ప్రస్తుతం కష్టాల్లో ఉన్నారు. బలగం సినిమా తర్వాత నుంచి ఆరోగ్యం బాగాలేని ఈయన అనేక ఆర్థిక సమస్యలతో కొట్టిమిట్టాడుతున్నారు. పేదరికంతో ఉన్న మొగిలయ్యకు ప్రభుత్వం నుంచి వస్తున్న పించన్ ఆగిపోవడంతో కొద్దిరోజుల నుంచి కూలీ పని చేసుకుంటూ తన కుటుంబాన్ని పోషిస్తున్నారు. అందుకు సంబంధించిన వీడియోలు నెట్టింట వైరల్ అయ్యాయి. విషయం తెలుసుకున్న బుల్లితెర నటి జ్యోతిరాయ్ సాయం చేసేందుకు ముందుకు వచ్చింది.

మొగిలయ్యకు ఆమె అక్షయ తృతీయ నాడు తన వంతుగా రూ. 50 వేలు సాయం చేసింది. ప్రస్తుతం తాను కూడా కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటున్నానని ఆమె తెలిపింది. తన ఇబ్బందుల కంటే మొగిలయ్య పరిస్థితి ఎక్కువగా కలచివేసిందని ఆమె పేర్కొంది. ఆయన ప్రతిభకు తను ఇస్తున్న డబ్బు పెద్ద సాయం కూడా కాదని ఆమె తెలిపింది. అనంతరం మొగలయ్య పాదాలకు నమస్కరించి జ్యోతిరాయ్ ఆశీర్వాదం తీసుకుంది. మొగిలయ్యకు సాయం చేసేందుకు మరికొందరు ముందుకు రావాలని ఆమె పేర్కొంది.  అయితే తనపై ఎన్ని రూమర్స్ వచ్చినా తానేం పట్టించుకోనని. కొందరు తనను కిందకు లాగాలనుకుంటే తాను మరింత పైకి ఎగురుతానంటూ వివరించింది. ప్రస్తుతం జ్యోతి రాయ్ చేసిన ఈ పొస్ట్ నెట్టింట వైరల్ అవుతోంది.

కొద్దిరోజులుగా జ్యోతిరాయ్ వ్యక్తిగత వీడియోలు, ఫోటోలు అంటూ కన్నడ సోషల్ మీడియాలో భారీగా వార్తలు వచ్చాయి. ఆమెను కొందరు కావాలనే టార్గెట్ చేసినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో ఆమె పోలీసులకు ఫిర్యాదు కూడా చేశారని తెలిసింది. అయితే తొలిసారి తన సోషల్ మీడియా ద్వారా ఈ అంశం మీద రియాక్ట్ అయింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *