నందమూరి బాలకృష్ణ గారి స్వర్ణోత్సవ వేడుకలకు ఆహ్వానించిన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు

తెలుగు సినీ పరిశ్రమలో నందమూరి బాలకృష్ణ గారు 50 ఏళ్ల సినీ ప్రయాణాన్ని పూర్తి చేసుకున్న సందర్భాన్ని పురస్కరించుకుని సెప్టెంబర్ 1న హైదరాబాద్ హైటెక్స్ నోవోటెల్ హోటల్లో గ్రాండ్ సెలబ్రేషన్స్ ని ప్లాన్ చేశారు. ఈ స్వర్ణోత్సవ వేడుకకు ముఖ్య అతిథిగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని ఆహ్వానించారు.
తెలుగు ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ హానరబుల్ ప్రెసిడెంట్ భరత్ భూషణ్ గారు, తెలుగు ఫిలిం ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ హానరబుల్ సెక్రటరీ టి. ప్రసన్నకుమార్ గారు, మరియు ప్రముఖ నిర్మాతలు కె. ఎల్. నారాయణ గారు, జెమినీ కిరణ్ గారు, కొమ్మినేని వెంకటేశ్వరరావు గారు, అలంకార్ ప్రసాద్ గారు, మరియు రాజా యాదవ్ గారు కలిసి, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారిని స్వయంగా కలిసి ఈ కార్యక్రమానికి ఆహ్వానించారు.
నారా చంద్రబాబు నాయుడు గారు ఈ ఆహ్వానానికి సానుకూలంగా స్పందించారు మరియు ఈ వేడుకలో పాల్గొనడం ఆనందంగా ఉంటుందని పేర్కొన్నారు. సినీ పరిశ్రమకు సంబంధించిన సమస్యలు మరియు ప్రత్యేకతలపై కూడా చర్చ జరిపారు, పరిశ్రమ అభివృద్ధికి ఆయన మద్దతు వ్యక్తం చేశారు.
